హాట్‌ అలర్ట్‌: పునర్నవి నెంబర్‌ వన్‌.

మరిన్ని వార్తలు

బిగ్‌ హౌస్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రియాల్టీ షో అన్న పేరు ఈ సీజన్‌ బిగ్‌బాస్‌కి అస్సలేమాత్రం పొసకడం లేదు. ఎందుకంటే హౌస్‌లో చాలామందిలో యాక్టింగ్‌ స్కిల్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ విషయం పసిగట్టిన బిగ్‌బాస్‌ టీమ్‌, లేటెస్ట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాతో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, హౌస్‌లోకి వెళ్లాక, తమన్నా కూడా అదే తీరు ప్రదర్శించడంతో బిగ్‌బాస్‌పై మొదటి రెండు రోజుల్లో ఉన్నంత బజ్‌ లేకుండా పోయింది.

 

ఇకపోతే, మొదట్లో శ్రీముఖి చుట్టూనే ఉన్న ఫోకస్‌ కాస్తా, మెల్లగా ఆమెకు యాంటీగా మారిపోయింది. హౌస్‌లోనూ, సోషల్‌ మీడియా వేదికగానూ ఇదే పరిస్థితి. ఈ క్రమంలో అనూహ్యంగా పునర్నవికి బయటి నుండి సపోర్ట్‌ పెరిగింది. హౌస్‌లో తన డిగ్నిఫైడ్‌ ఆటిట్యూడ్‌తో మంచి మార్కులు కొట్టేస్తోంది పునర్నవి. శ్రీముఖి హవా బాగా తగ్గిపోయింది. అలాగే ఇంతవరకూ హాట్‌ టాపిక్‌లో ఉన్న వరుణ్‌, వితికలు కూడా చర్చల్లో లేకుండా పోయారు. ఎక్కడ విన్నా, పునర్నవి పేరే మార్మోగిపోతోంది.

 

నిజానికి హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే బయటి నుండి టీమ్స్‌ రెడీ చేసుకున్నారు. ఆ టీమ్స్‌ వారి వారి స్థాయిలో ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కానీ, ఇంతవరకూ స్టడీగా ఉంటూ వచ్చిన పునర్నవి ఇప్పుడు టాప్‌ లిస్ట్‌ని టచ్‌ చేసింది. ఒక్కసారిగా న్యూట్రల్స్‌ నుండి ఆమెకు మద్దతు బాగా పెరుగుతోంది. చూడాలి మరి, పునర్నవిపై ఈ క్రేజ్‌ ఎంత కాలం ఉంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS