రాహుల్ సిప్లిగంజ్.. పరిచయం అక్కర్లేని పేరిది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్‌గా ఆడియన్స్ మనసు దోచుకుని, ట్రోఫీ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కి మనీ పరంగానే కాకుండా, కెరీర్ పరంగానూ బిగ్‌బాస్ బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీని బాగా యూజ్ చేసుకుంటున్నాడు రాహుల్. ఇంతవరకూ రాహుల్ ఒక సింగర్‌గా మాత్రమే తెలుసు. ఇకపై మ్యూజిక్ డైరెక్టర్ అవతారమెత్తబోతున్నాడట. ఇప్పటికే పర్సనల్‌గా చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారనున్నాడట.
ఆల్రెడీ కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాహుల్‌కి అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు, హీరోగా కూడా రాహుల్‌తో సినిమా తీసేందుకు కొందరు దర్శక, నిర్మాతలు సిద్ధపడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. అంటే, బిగ్‌బాస్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ చాలా బిజీ కానున్నాడన్న మాట. నిజానికి బిగ్‌బాస్ రియాల్టీ షో ఈ రేంజ్‌లో ఎవరికీ ఉపయోగపడలేదు. న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో రెండో సీజన్‌లో ఫేమ్ సంపాదించిన కౌశల్ కూడా బిగ్‌బాస్ తర్వాత బిజీ అవుతాడని అనుకున్నారంతా. కౌశల్ హీరోగా సినిమా అంటూ ఇలాగే బిగ్‌బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక ప్రచారం జరిగింది.
కానీ, కౌశల్ విషయంలో అవేమీ నిజం కాలేదు. కానీ రాహుల్ విషయంలో అలా కాదు. ఆల్రెడీ సింగర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆ పేరుతో పాటు, బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌కి రాహుల్ తన కెరీర్‌ని పక్కా ప్లానింగ్‌తో బిల్డప్ చేసుకోగలడని ఆయన అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సో అతి త్వరలోనే రాహుల్ సిప్లిగంజ్‌ని, హీరోగానో, మ్యూజిక్ డైరెక్టర్‌గానో చూడొచ్చన్న మాట.