జక్కన్న చెక్కుతున్న అద్భుత కావ్యం 'ఆర్‌ఆర్‌ఆర్'కి సంబంధించి ఫ్రెష్ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా అనౌన్స్‌మెంట్ రోజే, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు జక్కన్న. ఆ డేట్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదనే ఉద్దేశ్యంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరిపిస్తున్నాడు. అప్‌డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు కానీ, తెర వెనుక షూటింగ్ ఎలాంటి అడ్డంకి లేకుండా జరిగిపోతుందనే సమాచారం పక్కాగా ఉంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఇప్పటికే చాలా సీన్లు తెరకెక్కించారు. అలాగే ఎప్పుడో ఫిక్స్ అయిన రామ్ చరణ్ జోడీ అలియా భట్‌పై కూడా షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయిపోయిందట. అయితే, ఇంతవరకూ ఎన్టీఆర్ హీరోయిన్ మాత్రం కన్‌ఫామ్ కాలేదు. ఫిక్షన్ కథాంశం ప్రకారం ఎన్టీఆర్ ఓ విదేశీ భామతో లవ్‌లో పడతాడు. ఆ పాత్ర కోసం మొదట ఎడ్గర్ జెయిన్స్‌ని ఎంచుకున్నా, అనూహ్యంగా ఆమె హ్యాండివ్వడంతో, ఆ పాత్ర సస్పెన్స్‌గా మారింది. తాజాగా మరో విదేశీ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ఐరిష్ మూలాలున్న ఆస్ట్రేలియన్ భామ కేథరీన్ లాంగ్ ఫోర్ట్‌ని ఎన్టీఆర్‌కి జోడీగా ఎంచుకున్నారంటూ ఆమె ఫోటోలు కొన్ని నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్‌కి జోడీ దొరికేసిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ ఉంది కాబట్టి రాజమౌళి కూడా ఫిక్సయిపోవచ్చు మరి.
అయితే, ఈ ప్రచారంలో నిజమెంతుంది.? నిజంగానే ఈ ఆస్ట్రేలియన్ బ్యూటీ 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం సెట్టయ్యిందా.? తెలియాలంటే జక్కన్న నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావల్సిందే. అన్నట్లు ఈ సినిమాలో మరో విదేశీ భామ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించనుందట. ఆ పాత్ర కోసం కూడా ఆస్ట్రేలియన్ భామనే ఎంచుకున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై ఓ క్లారిటీ రావాలంటే 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ స్పందించాల్సిందే.