ట్రైలర్‌ టాక్‌: గజ.గజ.గజ.. వణికించేసిన గద్దలకొండ గణేష్‌!

మరిన్ని వార్తలు

ఎవరీ 'గద్దలకొండ గణేష్‌' అనుకుంటున్నారా.? 'వాల్మీకి' సినిమాలో వరుణ్‌తేజ్‌ పాత్ర పేరే ఇది. వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ వదిలారు. ట్రైలర్‌ న భూతో న భవిష్యతి అనేలా ఉంది. 'గబ్బర్‌సింగ్‌' పవర్‌ అంతా ట్రైలర్‌లో చూపించేశాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్‌ పాత్ర డిజైన్‌ చేసిన విధానం కేక పుట్టించేస్తోంది. 'ఫామ్‌ హౌస్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్లు కాదు.. ఫామ్‌లో ఉన్న గ్యాంగ్‌ స్టర్‌ కావాలి మనకు..' అంటూ హీరో అధర్వ మురళి డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇక అంతే.. మన గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీ. స్టేజ్‌ దద్దరిల్లిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు.

 

80ల కాలం నాటి గ్యాంగ్‌ స్టర్‌ స్టోరీగా ఈ సినిమా కాన్సెప్ట్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తున్నాడు. పొడుగాటి గెడ్డం, ఉంగరాల జుట్టుతో ఉగ్రంగా కనిపించే రూపమొకటి, పాత ఎన్టీఆర్‌ కాలం నాటి బెల్ బాటమ్ ప్యాంటుతో గెటప్‌ ఒకటి. రెండూ ఒకదానికి ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. ఇక పూజా హెగ్దేని లంగా వోణీలో చక్కగా అందంగా చూపించాడు. మరో హీరోయిన్‌ మ్రుణాలళిని రవి, అధర్వ మురళి మధ్య రొమాంటిక్‌ సీన్‌ కట్‌ చేశాడు. 'మన చేతిలో గీతలే ఉంటాయి.. రాతలు మన చేతుల్లో ఉండవ్‌..', 'నా మీద బెట్‌ కట్టుకోండి.. కానీ, నాతోనే బెట్‌ కడితే చచ్చిపోతారు..' వంటి డైలాగులు అబ్బో హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించేశాయి.

ఓ సాధారణ వ్యక్తి మహాఋషిగా ఎలా మారాడు అన్నదే 'వాల్మీకి' కథ.. అదే మన సినిమా టైటిల్‌ అని చెప్పి, చివర్లో ఓ పెద్దావిడతో 'చింపేశావ్‌ పో' అని ట్రైలర్‌పై టోటల్‌ ఒపీనియన్‌ అదే అన్నట్లుగా కట్‌ చేశాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, తెలంగాణా యాసలో డైలాగులు 80ల కాలం నాటి విజువల్స్‌ అన్నీ చక్కగా సెట్టయ్యాయి. ఖచ్చితంగా 'వాల్మీకి'తో హరీష్‌ శంకర్‌ 'గబ్బర్‌సింగ్‌' మ్యాజిక్‌ రిపీట్‌ చేసేలానే ఉన్నాడు. నిజంగానే ట్రైలర్‌ చించేశాడు. ఇక సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే సెప్టెంబర్‌ 20 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS