రాఖీకి రాహుల్‌ని మినహాయించిన పునర్నవి

మరిన్ని వార్తలు

తమన్నా అవుట్‌ అయ్యాకా, బిగ్‌హౌస్‌లో లొల్లి తగ్గిపోయే. అలా అని జోష్‌ కూడా పాయె. జాఫర్‌ చెప్పినట్లు గ్రూపుల కల్చర్‌ కూడా కనిపించలేదు. హౌస్‌మేట్స్‌ అంతా కలిసి మెలిసి సాఫీగా లైఫ్‌ లీడ్‌ చేసేస్తున్నారంతే. ఇక ఇండిపెండెన్స్‌డే సందర్భంగా బిగ్‌హౌస్‌లో కొత్త సందడి ఏమైనా నెలకొంటుందేమో అని బిగ్‌బాస్‌ ప్రేమికులు ఎక్స్‌పెక్ట్‌ చేశారు. కానీ, చప్పగా సాగింది. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా చేసిన స్కిట్‌లు ఆకట్టుకోలేదు. ఇక ఇదే రోజు రక్షా బంధన్‌ కూడా కలిసి రావడంతో, తర్వాతి రోజు రక్షా బంధన్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు హౌస్‌మేట్స్‌.

 

కుటుంబ సభ్యులు బయటి నుండి గిఫ్ట్‌లు, రాఖీలు పంపించారు. హౌస్‌మేట్స్‌లో ఫిమేల్‌ కుటుంబ సభ్యులు, బ్రదర్స్‌లా ఫీలయ్యే మేల్‌ కంటెస్టెంట్స్‌కి రాఖీలు కట్టి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొంతమందికి గిఫ్ట్స్‌ కూడా అందాయి. ఈ సందర్భంగా సాగిన క్విజ్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ టాస్క్‌లో వరుణ్‌, వితిక మ్యారేజ్‌ యానివర్సరీ ఎప్పుడు.? వంటి కొన్ని సిల్లీ క్వశ్చన్స్‌ విసిగెత్తించాయి. కానీ ఓవరాల్‌గా బిగ్‌హౌస్‌లో రక్షా బంధన్‌ కొన్ని ఎమోషన్స్‌, కొన్ని సెలబ్రేషన్స్‌తో ఓకే అనిపించింది.

 

పునర్నవి హౌస్‌ మేట్స్‌ అందరికీ రక్షా బంధన్‌ విషెస్‌ చెప్పి, ఒక్క రాహుల్‌కి తప్ప.. అని పేర్కొనడం హైలైట్‌ అయ్యింది. వీరిద్దరి మధ్యా ఏదో ఉంది.. అన్నదానికి ఈ సందర్భం బలం చేకూర్చింది. అంతేకాదు, పునర్నవి చేత్తో తినిపిస్తే ఆ టిఫిన్‌ టేస్టీగా ఉంది.. తన చేత్తో తింటే, టేస్ట్‌ తగ్గిందని రాహుల్‌ చెప్పడం లేటెస్ట్‌గా బిగ్‌హౌస్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సాగిన సన్నివేశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS