ఆక్టోబర్ 2 న 'సైరా నరసింహారెడ్డి' వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క ప్రమోషన్స్‌ని విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారట. సౌత్ భాషలతో పాటు, నార్త్‌లో కూడా 'సైరా' విడుదల కానుంది. సో ప్రమోషన్స్ విషయంలో ముందు నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎక్కడెక్కడ ఏ ఏ తేదీల్లో ప్రమోషన్స్ చేయాలి అనే దానిపై పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోందట సైరా టీమ్.
అందుకోసం ప్రత్యేకమైన ఓ టీమ్ వర్క్ చేస్తోందట. ఇదిలాఉంటే, ప్రమోషన్స్‌లో మెయిన్ పార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కర్నూల్‌లో ప్లాన్ చేశారు. కర్నూల్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగాడిన ప్రదేశం అదే కాబట్టి, ఆయన జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అంతకన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదనే అభిప్రాయంతో ఆ ప్లేస్‌ని ఫిక్స్ చేశారు. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొంది.
నిజానికి ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆ విషయమై హడావిడి కనిపించడం లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈవెంట్‌లో ఏమైనా మార్పులు చేశారా? అనే దానిపైనా సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. సో ఈ ఈవెంట్ విషయమై 'సైరా' టీమ్ స్పందించాల్సి ఉంది. ఇక అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్‌తో సహా మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరూ హాజరు కానున్నారని తెలుస్తోంది.