ప్రార్థనలు ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు. ఈరోజు ఉదయం గుండె పోటుతో పునీత్ ఆసుపత్రి చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ని కాపాడాలని వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. పరిస్థితులు విషమించడంతో రాజ్ కుమార్ మృతి చెందారు.
కన్నడ నాట తిరుగులేని స్టార్ గా పేరు తెచ్చుకున్నారు పునీత్. ఆయన్ని అభిమానులు పవర్ స్టార్ గా పిలుస్తారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్కూల్స్, ధియేట్ర్స్ అన్నీ మూసేయాల్సిందిగా కోరింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యలను పరామర్శించారు.