కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి అత్యంత ఆందోళన కరంగా ఉంది. ఆయన ఈ రోజు ఉదయం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా గుండె పోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు ఓ హెల్త్ బులిటెన్ ని విడుదల చేయబోతున్నారు.
అయితే ఈలోగా పునీత్ రాజ్‌కుమార్ చనిపోయాడంటూ. వార్తలు మొదలైపోయాయి. అవి కాస్త వైరల్ గా మారాయి. రాజ్ కుమార్ ఇప్పటికే మరణించారని, అయితే వైద్యులు ఇంకా ధృవీకరించలేదని చెబుతున్నారు. అయితే.. రాజ్ కుమార్ ఈ గండం నుంచి గట్టెక్కాలని... అభిమానులు పూజలు చేస్తున్నారు. రాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగిరావాలన్నదే అందరి ప్రార్థన.