కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చిత్రసీమని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ ఇక లేడన్న విషయాన్ని అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో తనువు చాలించడం... అంతులేని విషాదాన్ని నింపుతోంది. పునీత్ మరణంతో ఇప్పుడు నాలుగు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దాదాపుగా 400 కోట్ల పెట్టుబడులుపై ఆ ప్రభావం పడబోతోంది.
కన్నడలో పునీత్ ఓ స్టార్ హీరో. తన సినిమా అంటే కనీసం 60 నుంచి 70 కోట్ల బిజినెస్ గ్యారెంటీ. తన రెండు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. ప్రస్తుతం జేమ్స్, ద్విత్త అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ కలిపి రూ. 120 కోట్లు. వాటితో పాటుగా మరో రెండు సినిమాలకు సంబంధించి అడ్వాన్సులు తీసుకున్నారాయన. మరోవైపు పునీత్ నిర్మాతగానూ బిజీ.
తన బ్యానర్‌లో ఏకంగా 5 సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఇవన్నీ కలిపితే దాదాపు 400 కోట్ల విలువ ఉంటుందట. పునీత్ నిర్మాతగా చేస్తున్న సినిమాలన్నీ ఏదోలా గట్టెక్కెస్తాయి. కానీ..,.. హీరోగా చేస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాల మాటేమిటో? అర్థం కావడం లేదు.