‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన జోష్‌తో, ‘ఫైటర్’ సినిమాని మరింత ఉత్సాహంగా తెరకెక్కిస్తున్నాడు ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. పాన్ ఇండియా సినిమాగా ఈ ‘ఫైటర్’ రూపొందుతోంది. అయితే, తొలుత ఫైటర్ అనే టైటిల్ ఖరారు చేసినా, ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మారడంతో, టైటిల్ విషయమై కొంత గందరగోళం నెలకొంది. ఇదిలా వుంటే, ప్రస్తుతం కరోనా హాలీడేస్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమా గురించీ, సమాజం గురించీ పూరి జగన్నాథ్ తాజాగా తన మనసులోని భావాల్ని పంచుకున్నాడు.
ప్రకృతిని మనిషి నాశనం చేయడం వల్లే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డాడు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గాలనీ సూచించాడు పూరి జగన్నాథ్. కాగా, విజయ్ దేవరకొండ గురించి చెబుతూ, రౌడీ హీరో చాలా హార్డ్ వర్కర్ అనీ, ‘ఫైటర్’ సినిమా కోసం అతను పడ్తున్న కష్టం అంతా ఇంతా కాదనీ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇరగదీసేస్తున్నాడంటూ ఫైటర్ గురించి చెప్పాడు. బాలీవుడ్ సినిమా గతంలోనూ చేశాడు పూరి జగన్నాథ్. బాలీవుడ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గా వుంటుందని చెబుతోన్న పూరి, తెలుగు సినిమా, తమిళ సినిమా అనే బౌండరీస్ ఇప్పుడు లేవనీ, కంటెంట్ బావుంటే చాలు అదు లోకల్ సినిమా అయినా పాన్ ఇండియా సినిమాగా మారిపోతుందని చెప్పాడు.