వర్మ పెళ్ళిగోల.. ఆయన పేరే ఓ సంచలనం మరి.!

మరిన్ని వార్తలు

రామ్ గోపాల్‌ వర్మ.. ఆ పేరే ఓ సంచలనం. పరిచయం అక్కర్లేని పేరిది. సంచలన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్ గోపాల్‌ వర్మ, ఈ మధ్య తన స్థాయికి తగ్గ సినిమాలు మాత్రం తీయడంలేదు. ఈ క్రమంలో వర్మ తన స్థాయిని తానే తగ్గించేసుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కానీ, వర్మ మాత్రం ‘అంతా నా ఇష్టం’ అంటారు. అదే ఆయన ప్రత్యేకత. సోషల్‌ మీడియాని వాడేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఇక, వర్మ తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ‘పెళ్ళి’ గురించి. తనకు పెళ్ళి చేసుకోవాలని వుందంటూ, అందుకు ఓ ఫన్నీ రీజన్‌ కూడా చెప్పారు.

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో కోసం ‘దళపతి’ సినిమాలోని పాటని బ్యాక్‌గ్రౌండ్‌గా వాడారు. అదే వర్మకి బాగా నచ్చేసింది. అంత గొప్పగా ఆ వీడియో ఎవరి చేతిలో ఎడిట్‌ అయ్యిందోగానీ, ఆ వ్యక్తిని తాను పెళ్ళాడాలనుకుంటున్నట్లు వర్మ పేర్కొన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు వర్మకి కొత్తేమీ కాదుగానీ, వర్మ మనసు పెళ్ళి వైపు ఎందుకు మళ్ళింది చెప్మా.? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పెళ్ళికి సంబంధించిన వ్యవహారం కాదు, జస్ట్‌ అది వర్మ కోణంలో ఓ ఎక్స్‌ప్రెషన్‌ మాత్రమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS