పూరి జగన్నాధ్ అంటేనే సినిమాని ఆయన తీసినంత త్వరగా ఎవరు తీయరనే ఒక పేరు ఉంది ఇండస్ట్రీలో.
అయితే అది చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయినా అతనికి ఒకటే. మొన్న 16వ తారీఖున మొదలయిన బాలయ్య 101వ సినిమా మొదటి షెడ్యూల్ నిన్నటితో అయిపోయింది.
ఈ ఆరు రోజుల్లో బాలయ్య పైన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్టు స్వయంగా పూరినే తెలిపాడు. ఇక సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ తేదీని 29 సెప్టెంబర్ అని ప్రకటించడంతో, పూరీ కి ఈ సినిమా పై ఎంత క్లారిటీ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.