మూడేళ్ల తరవాత... వచ్చినా, తనకేమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ గా పవన్ చేసిన సందడితో థియేటర్లన్నీ కళకళలాడాయి. తొలి మూడు రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లని అందుకుంది. వంద కోట్ల మైలు రాయిని ఈజీగా దాటేసింది. అయితే.. తొలి వారంలో బ్రేక్ ఈవెన్ కి కాస్త దగ్గరల్లో ఆగింది. రెండో వారం అది కవర్ చేస్తుందనుకుంటే... అనుకోని అవాంతరం ఎదురైంది.
కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూతబడ్డాయి. ఓ 10 శాతం థియేటర్లు ఉన్నాయంతే. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు వస్తారన్న నమ్మకం లేదు. పైగా పవన్ ఫ్యాన్సంతా.. ఈ సినిమాని ఇప్పటికే చూసేశారు. కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే.. థియేటర్లకు వచ్చే అవకాశం లేదు. సో.. వకీల్ సాబ్ కి ఇది పెద్ద దెబ్బే అనుకోవాలి. తొలి మూడు రోజుల్లో ఆ స్థాయి కలక్షన్లు రాకపోతే... ఈ సినిమా తీవ్ర స్థాయిలో నష్టపోయేది. సినిమాకి పాజిటీవ్ టాక్ రావడం, తొలి మూడు రోజుల్లో సగానికి పైగా పెట్టుబడి తిరిగి దక్కించుకోవడంతో.. బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.