శ్రుతిహాసన్ పంట పండింది. ఈ యేడాది క్రాక్‌తో ఓ సూపర్ హిట్టు కొట్టింది. వకీల్ సాబ్ లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించింది. ప్రభాస్ `సలార్`లో కథానాయికగా ఎంపికైంది. ఇటీవలే శ్రుతి సెట్స్‌లో కూడా అడుగుపెట్టింది. మాఫియా నేపథ్యంలో సాగే కథ `సలార్`. ప్రభాస్.. ఓ డాన్ కి రైట్ హ్యాండ్ గా నటించబోతున్నాడు. ఇప్పుడు శ్రుతిహాసన్ పాత్రేమిటన్నదీ తేలిపోయింది.
ఇందులో శ్రుతి జర్నలిస్టుగా కనిపించనుందని తేలింది. ప్రభాస్ ని నీడలా వెంటాడే పాత్ర ఇదట. శ్రుతి పాత్ర రొమాంటిక్ గా ఏమీ ఉండదని... తను కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ పాల్గొంటుందని తేలింది. శ్రుతి యాక్షన్ సీన్లలో బాగా రాణిస్తుంది. ఈ విషయం `క్రాక్`లో ఓ ఎపిసోడ్ లో తేలిపోయింది. బహుశా.. ఆ సినిమా చూసే, ఇందులో కథానాయికగా శ్రుతిని ఎంచుకున్నారేమో..? మొత్తానికి `సలార్` లో శ్రుతి మరోసారి సరికొత్తగా కనిపించబోతోందన్న విషయం తేలిపోయింది.