ఓ సూపర్ హిట్ డైరెక్టర్, ఓ స్టార్ హీరో... ఈ కాంబో సెట్ అవ్వడం మామూలు విషయం కాదు. ఎందుకంటే.. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటారు. ఫలానా హీరోతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉంటే సరిపోదు. ఆ హీరోకి సరిపడా కథ ఉండాలి. అప్పుడు గానీ ఆ కాంబో సెట్టవ్వదు. అలా ఓ కాంబినేషన్ సెట్ చేసుకొని... వరుసగా సినిమాలు చేస్తుండడం మామూలు విషయం కాదు.
అర్జున్ రెడ్డితో ఎక్కడికో వెళ్లిపోయాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందంతో వంద కోట్ల హీరో అనిపించుకొన్నాడు. ఇప్పుడు విజయ్ ఓ సినిమాకి డేట్లు ఇవ్వడం మామూలు విషయం కాదు. పూరి - విజయ్ కాంబోలో లైగర్ సెట్టయ్యింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. `జనగణమన` అనే మరో సినిమాకి క్లాప్ కొట్టి, ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లిపోయాడు పూరి. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, అదే హీరోతో మరో సినిమా చేయడం మామూలు విషయం కాదు. ఇప్పట్లో అదో రికార్డ్. ఇప్పుడు మరో ఫీట్ చేస్తోంది ఈ జంట.
`లైగర్`.`జనగణమన` రెండూ అయిపోయాక.. వెంటనే మూడో సినిమాని ఇదే కాంబినేషన్లో సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నార్ట. `జనగణమన` అవ్వగానే... హ్యాట్రిక్ సినిమాకి కొబ్బరి కాయ కొడతారని, విజయ్ తో వరుసగా మూడు సినిమాలు చేశాకే... పూరి.. మరో హీరోతో సినిమా తీస్తాడని ప్రచారం జరుగుతోంది. విజయ్ లాంటి క్రేజీ హీరోతో బ్యాక్ టై బ్యాక్ సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. దాంతో పూరి ఏదో మంత్రం వేశాడని, అందుకే ఈ మ్యాజిక్ సాధ్యమైందని గుసగుసలాడుకుంటోంది టాలీవుడ్.