మ‌హేష్‌పై పూరి మాటల్లో నిజ‌మెంత‌..?

మరిన్ని వార్తలు

`నాకు హిట్ ఉంటేనే మ‌హేష్ నాతో సినిమా చేస్తాడు` - ఇదీ మ‌హేష్ బాబుపై పూరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ అయ్యింది. మ‌హేష్‌బాబుతో పోకిరి, బిజినెస్‌మెన్ సినిమాలు చేశాడు పూరి. పోకిరి ఇండ్ర‌స్ట్రీ హిట్‌, బిజినెస్‌మెన్ యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ ద‌శ‌లో మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయాల‌ని పూరి బాగా ప్ర‌య‌త్నించాడు.

 

`జ‌గ‌న‌గ‌ణ‌మ‌న‌` సినిమా రాబోతోంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు క‌ద‌ల్లేదు. పూరికి వ‌రుస ఫ్లాపులు ప‌డ‌డంతో - పూరితో సినిమా చేయ‌డానికి మ‌హేష్ భ‌య‌ప‌డిన మాట వాస్త‌వం. మ‌హేష్ అనేంటి? ఏ హీరో అయినా స‌రే, ఆ స్థితిలో పూరికి ఛాన్సులివ్వ‌డానికి ఆలోచిస్తాడు. అయితే... మ‌హేష్‌పై పూరి వ్యాఖ్య‌ల్ని కొంత‌మంది సినీ విశ్లేష‌కులు త‌ప్పు ప‌డుతున్నారు.

 

పోకిరికి ముందు ఆంధ్రావాలా అనే డిజాస్ట‌ర్ పూరి ఖాతాలో ఉంది. అయినా స‌రే, పోకిరి ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌గ‌లిగింది. బిజినెస్‌మెన్‌కి ముందు కూడా పూరికి ఫ్లాపులున్నాయి. ప్ర‌భాస్‌కి ఏక్ నిరంజ‌న్ అనే ఫ్లాప్ ఇచ్చాడు పూరి. అంటే.. మ‌హేష్‌తో సినిమాల‌కు ముందు పూరి ఫ్లాపుల‌లోనే ఉన్నాడు. అలాంట‌ప్పుడు పూరి ఇలాంటి స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావ‌డం లేదు. అందుకే మ‌హేష్ ఫ్యాన్సంతా పూరిపై ఫైర్ అవుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS