పుష్ప రాజ్.. తగ్గేదే లే అంటూ పుష్పలో హడావుడి సృష్టించాడు బన్నీ. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2పైనే ఉంది. పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందే.. పుష్ప గ్లిమ్స్‌ని విడుదల చేయడానికి సుకుమార్ టీమ్ సన్నాహాలు ప్రారంభించేసింది. అవతార్ 2తో పాటుగా పుష్ప 2 గ్లిమ్స్‌ని చిత్రబృందం విడుదల చేయబోతోంది. ఇందులో బన్నీ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి.. సోషల్ మీడియాలో ముందే లీక్ అయి... హల్ చల్ చేస్తోంది.
”అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్ధం” - ఇదీ లీకైన పుష్ప 2 డైలాగ్. డైలాగ్ అయితే అదిరిపోయింది. అయితే ఇది పుష్ప 2 డైలాగా, ఫ్యాన్స్ సృష్టించిందా, అనేది మాత్రం తెలీదు. కాకపోతే ఈ లీకేజీల పట్ల.. సుకుమార్ ఆందోళనగా ఉన్నాడని టాక్. ఈ డైలాగ్ గ్లిమ్స్ లో ఉంటే గనుక.. చూసే జనాలకు కిక్ రాదు. ఎందుకంటే ఇప్పటికే డైలాగ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొత్త డైలాగ్ రాసుకొని, దాన్నిషూట్ చేసేంత టైమ్ సుకుమార్ కి లేకపోవొచ్చు. ఇక మీదట.. సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయమూ బయటకు రాకూడదని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకు సంబంధించిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాడని టాక్.