పుష్ప 2 సింగిల్ స్క్రీన్ టికెట్ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు

వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా నడుస్తోంది. డిసెంబరు 5 న పుష్పరాజ్ వేంచేయ నుండటంతో ఫాన్స్ ఘనస్వాగతం చెప్పటానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 1 ని రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. తెలుగులో రీరిలీజ్ ఎప్పుడన్నది తెలియటం లేదు. కానీ నార్త్ లో మాత్రం నవంబర్ 22 న రీరిలీజ్ చేయనున్నట్లు టాక్. పుష్ప 1 ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే నార్త్ లో కూడా కోట్లు వసూల్ చేసింది. అందుకే మరొకసారి పార్ట్ 1 రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. తెలుగులో రీరిలీజ్ ల ట్రెండ్ విరివిగా ఉన్నా నార్త్ లో ఇప్పటివరకు పెద్దగా రీరిలీజ్ ట్రెండ్ లేదు. కేవలం తుంబాడ్ మూవీ ఒకటే రీరిలీజ్ చేసారు. ఇప్పడు పుష్ప రీరిలీజ్ చేస్తే తెలుగు సినిమా నార్త్ లో రెండు సార్లు రిలీజైన ఘనత దక్కుతుంది.

పుష్ప 2 ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచాడు పుష్ప రాజ్. నిజంగా ఈ సారి మామూలు ఫైర్ కాదు వైల్డ్‌ ఫైర్‌ అనేలా ఉంది ట్రైలర్ చూస్తే. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ సుమారు 11 వేల థియేటర్లలో రిలీజ్ కానుంది పుష్ప-2 . అప్పుడే బిజినెస్ మొత్తం జరిగినట్లు, రిలీజ్ కి ముందే దాదాపు 1100 కోట్లు సంపా దించినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఆల్ టైం కలక్షన్స్ లో దంగల్ 2000 కోట్ల వసూళ్లతో మొదటి ప్లేస్ లో ఉండగా, బాహుబలి 1800 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేలా  ఉంది పుష్ప 2 అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇవన్నీ సరే అని ఇపుడు ఇండస్ట్రీలో  సినిమా బిజినెస్‌ మీద ఫోకస్ పెట్టారట మేకర్స్. టికెట్‌ రేట్లు వీలైనంత పెంచుకునేలా పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారట. సినిమా రిలీజ్ టైమ్‌లో స్పెషల్ షోలు, ఎక్సట్రా రేట్లు పెంచుకోవడానికి పుష్ప-2 టీమ్ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఏపీ లో కూటమి సర్కార్ సినిమా వాళ్ళ కోరికను మన్నించి, హై బడ్జెట్ సినిమాకి టికెట్ రేటు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. దేవర, కల్కి సినిమాలకు సింగిల్ స్క్రీన్ రేట్స్ 250 వరకు పెంచింది. అయితే ఇప్పుడు పుష్ప మేకర్స్ సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ 300 దాకా పెంచాలని కోరుతున్నారట. అంటే ఆటో మెటిక్ గా మల్టీప్లెక్స్‌ రేట్లు పెరుగుతాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS