టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పెళ్లి కానీ బ్యాచిలర్స్ అంతా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. చైతు, శోభిత డిసెంబరు 4 న పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ శ్రీ సింహ పెళ్లి జరగనుంది. ఇదే ఏడాది డిసెంబర్ లో కీర్తి సురేష్ పెళ్లి జరగనుంది. ఇప్పుడు మరొక సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా తన పెళ్ళి వార్త చెప్పకనే చెప్పాడు. అతనే శ్రీ కాంత్ అయ్యంగారు. ఈ మధ్య రివ్యూ రైటర్స్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తీరికగా క్షమాపణలు చెప్పి వైరల్ అయిన శ్రీ కాంత్ అయ్యం గారు లేట్ వయసులో పెళ్ళికి సిద్ధం అయ్యారు.
వధువు ఎవరో కాదు టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన జ్యోతి. ప్రస్తుతం అయ్యం గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. జ్యోతి, అయ్యంగారికి ముద్దు పెడుతుండగా ఫొటో తీసుకుని మరీ పోస్ట్ చేసారు. అంతే కాదు 'క్రష్ ఆఫ్ మై లఫ్. మీ దేవుళ్లు మాకు పెళ్లిచేయాలి అనుకుంటున్నారా' అంటూ పోస్ట్ కూడా పెట్టారు. ఈ పిక్, అయ్యంగారి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా జ్యోతి రొమాంటిక్ కామెడీ పాత్రలతో పాపులర్ అయింది. 'పెళ్ళాం ఊరెళితే' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతి.
ఎవడిగోల వాడిదే, దరువు, యముడికి మొగుడు లాంటి సినిమాల్లో నటించింది జ్యోతి. ఇక అయ్యం గారి ప్రతిభ గూర్చి చెప్పక్కరలేదు. జ్యోతికి ఇదివరకే పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నాడు. మొత్తానికి ఒంటరిగా ఉన్న శ్రీకాంత్ అయ్యంగారి జీవితంలోకి వెలుగు నింపటానికి జ్యోతి వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.