పుష్ఫ ఎంత సూపర్ డూపర్ హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఇంత పెద్ద హిట్టయినప్పుడు పార్ట్ 2 వెంటనే మొదలెట్టేయాలి. అల్లు అర్జున్ కూడా మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నది అందుకే. కానీ.. సుకుమార్ మాత్రం... పార్ట్ 2 గురించి ఎలాంటి కబురూ చెప్పడం లేదు. పుష్ప ఇంత పెద్ద హిట్టవుతుందని సుకుమార్ కూడా అనుకుని ఉండడు.
నార్త్ లో అయితే... పుష్ప ఓ ఫీవర్ లా పట్టుకొంది. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో మెప్పించాలంటే కథపై కసరత్తు చేయాలి. అల్లాటప్పాగా తీసేస్తే కుదరదు. పార్ట్ 2 రాసుకునేటప్పుడు కొత్త పాత్రలేం రాకుండా ఉండాలని.. సుకుమార్ భావించాడు. కానీ.. అది సాధ్యం కావడం లేదు. కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే పార్ట్ 2 లేటవుతోంది.
నిజానికి 2022 సంక్రాంతి అవ్వగానే.. పార్ట్ 2 స్టార్ట్ అవ్వాలి. కానీ... సుకుమార్ ఏప్రిల్ వరకూ సమయం అడిగాడు. అది కూడా దాటేసింది. ఇప్పుడు అక్టోబరులో తప్ప సినిమా మొదలవ్వదని అంటున్నార్ట. బన్నీ అక్టోబరు వరకూ ఆగాలంటే కష్టమే. అందుకే... ప్లాన్ బి చూసుకుంటున్నాడు. సుకుమార్ అక్టోబరు అన్నాడంటే.. మరో రెండు నెలలు పొడిగించడం ఖాయం. అందుకే.. బన్నీ మరో సినిమా చేసుకుందామని భావిస్తున్నాడు. ఈ యేడాది చివర్లో పుష్ఫ 2 సెట్స్‌పైకి వెళ్తుందని, 2023 డిసెంబరులో గానీ, 2024 సంక్రాంతికి గానీ.. ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.