ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు. 80 ఏళ్ల లోహితస్వ ప్రసాద్..గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో చికిత్స పోందు తూతుది శ్వాస విడిచాడు. ఆయన మృతిపట్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తుంది.
లోహితస్వ ప్రసాద్ కన్నడలో దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు. పలు సీరియల్స్‌లోనూ కనిపించారు. 'AK 47', 'దాదా', 'దేవా', 'నీ బారెడ కాదంబరి', 'సాంగ్లియానా' చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'యాంటీమ్ రాజా', 'గృహభంగ', 'మాల్గుడి డేస్', 'నాట్యరాణి శాంతల' లాంటి ప్రముఖ సీరియల్స్ లో ఆయన కనిపించారు.
తెలుగు సినిమాల్లో కూడా ఆయన పరిచయం వుంది. ‘అఖండ, ‘సాహో’, ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ తదితర సినిమాలలో కనిపించారు. ఆయన కుమారుడు శరత్ కూడా నటుడిగానే వున్నారు.