మహేష్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కింది. ఓ ఫైట్ కూడా షూట్ చేశారు. కానీ... అప్పటి నుంచీ ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ స్క్రిప్టుని ఇంకా లాక్ చేయలేదని, పూర్తి స్థాయి స్క్రిప్టు లేకుండా షూటింగ్ కి వెళ్లేది లేదని మహేష్ తెగేసి చెప్పాడని, దాంతో ఈ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. దాంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అనే డౌటు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈమధ్యే మహేష్‌ని కలిసిన త్రివిక్రమ్.. ఫుల్ స్క్రిప్టు నేరేట్ చేశాడట. దాంతో.. మహేష్ కూడా ఖుషీ అయ్యాడని తెలుస్తోంది.
ఈనెల మూడో వారంలో కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు సుదీర్ఘంగా సాగబోతోందని సమాచారం. ఈ షెడ్యూల్ లో దాదాపుగా 30 శాతం టాకీ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 2023 చివర్లో ఈ చిత్రం విడుదల కానుంది. తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్లు సిద్ధం చేశాడట. అవి.. మహేష్‌కి తెగ నచ్చాయని సమాచారం. జనవరిలో ఫారెన్‌లో ఓ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ లో పాటల్ని పూర్తి చేసుకొని వస్తారు. ఈ సినిమా కోసం చాలారకకాలైన టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ.. చిత్ర బృందం ఇప్పటి వరకూ టైటిల్ ఏమిటన్నది చెప్పలేదు.