ఒట్టి మాట‌లు క‌ట్టిపెట్టు రౌడీ!

By Gowthami - April 08, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

కరోనా పై పోరాటం చేస్తున్న ప్ర‌భుత్వానికీ, ప్ర‌జ‌ల‌కూ సినీ స్టార్లు త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు. స్టార్ హీరోలు కోట్ల‌కు కోట్లు విరాళాలు ప్ర‌క‌టించారు. సీసీసీ ద్వారా సినీ కార్మికుల క‌డుపులు నింప‌డానికి చిత్ర‌సీమ ప్ర‌య‌త్నిస్తోంది. కొంత‌మంది మాత్రం ఇప్ప‌టికీ విరాళాలు ప్ర‌క‌టించ‌లేదు. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. ఈత‌రం కుర్ర హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ సాధించిన క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌దుప‌రి త‌రం సూప‌ర్ స్టార్ గా విజ‌య్‌కి కితాబులు అందిస్తున్నారు. త‌న సంపాద‌న కూడా ఎక్కువే. కానీ విజ‌య్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క పైసా కూడా విద‌ల్చ‌లేదు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా క‌నిపించే ఈ రౌడీ.. అస‌లు ఈమ‌ధ్య ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్‌లోనూ విజ‌య్ ద‌ర్శ‌నాలు లేవు. దాంతో విజ‌య్ పై విమ‌ర్శలు పెరిగాయి. రౌడీ రూపాయి కూడా ఇవ్వలేదేంటి? అంటూ ప్ర‌శ్నించారు.

 

రౌడీ పెద్ద ప్లానులో ఉన్నాడ‌ని, త్వ‌ర‌లో భారీ ఎత్తున విరాళం ప్ర‌క‌టిస్తాడ‌ని స‌మాధానం ఇచ్చుకున్నారు. ఎట్ట‌కేల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల ముందుకు వ‌చ్చాడు. క‌రోనా విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించీ, మాస్కుల గురించీ విపులంగా విశ‌దీక‌రించాడు. కాక‌పోతే.. విరాళం మాటెత్త‌లేదు. దాంతో మ‌రోసారి విజ‌య్‌పై ట్రోలింగ్ మొద‌లైంది. ఇలాంటి జాగ్ర‌త్త‌లు మాకూ తెలుసు.. నీ వంతు స‌హాయం ఏమిటో చెప్పు అంటూ యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. వ‌ట్టిమాట‌లు క‌ట్టిపెట్టాల‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చే ప‌ని చేయాల‌ని... విజ‌య్‌కి రివ‌ర్స్ లో క్లాసు పీకుతున్నారు. మ‌రి విజ‌య్ ఎప్పుడు స్పందిస్తాడో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS