ఇప్పుడంతా పాన్ ఇండియా గోలే. స్టార్ హీరో సినిమా అంటే చాలు. తెలుగుతో పాటు మిగిలిన నాలుగు భాషల్లోనూ రావాల్సిందే. పుష్ష కూడా పాన్ ఇండియా సినిమానే. అందుకు తగ్గట్టుగానే భారీగా ఖర్చు పెడుతున్నారు. టీజర్ వదిలినా, లుక్ బయట పెట్టినా, అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తొలి పాట కూడా అన్ని భాషల్లోనూ వినిపించారు. అయితే... ఇటీవల `సామీ.. సామీ` అనే పాట ఒకటొచ్చింది. ఆ పాట టాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. అయితే ఈ పాట హిందీ వెర్షన్ ని ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. ఈపాట వరకూ హిందీలో స్కిప్ చేసే అవకాశం ఉందని టాక్. అంతేకాదు.. హిందీలో తక్కువ పాటలతోనే ఈసినిమాని విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరొకరైతే.. ఈ సినిమాని అసలు హిందీలోనే రిలీజ్ చేయడం లేదని, కేవలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకే ఈ సినిమాని పరిమితం చేస్తారని చెప్పుకుంటున్నారు. దీనిపై.. చిత్రబృందం ఓ క్లారిటీ ఇవ్వాలి. లేదంటే.... ఈ గందరగోళాలు అనవసరమైన కమ్యునికేషన్ గ్యాప్ ని క్రియేట్ చేస్తాయి. మరో పాటేదైనా పుష్ష నుంచి వచ్చి, ఆ పాటని హిందీలో విడుదల చేయకపోతే.. ఈ డౌటే నిజం అయ్యే ఆస్కారం వుంది.