నాగచైతన్యతో విడిపోయాక... సమంత వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో.. వేదాంతం వల్లిస్తోంది. తనకు తానే ధైర్య ప్రవచనాలు చెప్పుకుంటోంది. సినిమాలతోనూ బిజీగా ఉండాలనుకుంటోంది. అంతేకాదు.. ఇప్పుడు పారితోషికం కూడా పెంచేసింది. సమంత కథానాయిగా శ్రీదేవి మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమా కోసం సమంత ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇది వరకు సమంత పారితోషికం 2 కోట్ల లోపే. సమంత ఒక్కసారిగా పారితోషికం పెంచేసేసరికి.. నిర్మాతలు షాక్ తింటున్నారు.
దీనికి సమంత లాజిక్ కూడా వేసుకుంటోందట. ఇటీవల వచ్చిన పూజా హెగ్డే, రష్మికలకే రూ.3 కోట్ల పారితోషికం ఇస్తున్నారు, వాళ్లకంటే నేను సీరియర్ ని కదా, నాకు మూడు కోట్లు ఇవ్వరా? అని అడుగుతోందట. సమంత డిమాండ్ లో లాజిక్ ఉంది. రష్మిక, పూజాల కంటే సమంత సీరియర్. ఫ్యామిలీ మెన్ 2తో సమంత పాపులారిటీ మరింత పెరిగింది. ఈ ముగ్గురిలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసిన అనుభవం సమంతకే ఉంది. ఓటీటీ పరంగానూ... సమంత సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అందుకే సమంత 3 కోట్లు డిమాండ్ చేస్తోందట.