సుకుమార్ ఎప్పుడూ రెగ్యులర్ కథల జోలికి వెళ్లడు. తన సినిమా అంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉండాల్సిందే. ఆర్య నుంచి తనది అదే స్టైల్. తన కథలో లెక్కలూ, లాజిక్కులూ బోలెడన్ని ఉంటాయి. ఇప్పుడు `పుష్ష` విషయంలోనూ అదే ఫార్ములా ఎంచుకున్నాడట. అల్లు అర్జున్ నటిస్తున్న 20వ సినిమా ఇది. ఈరోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. పుష్ఫ అనేది హీరో పేరు. పుష్షరాజ్ అనే లారీ డ్రైవరు కథ. ఈ టైటిల్ లోగోలో.. వేలి ముద్రలకు సంబంధించిన గురుతులు కనిపిస్తున్నాయి.
ఈ వేలి ముద్రలకూ ఈ సినిమా కథకూ ఓ లింకు ఉందని సమాచారం. ఆ లింకేమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి సంబంధించిన కథ ఇది. దానికి తగ్గట్టు చిత్రబృందం మరో లుక్ విడుదల చేసింది. అందులో ఎర్రచందనం, గొడ్డలి కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో పుష్ష లొంగిపోయిన షాట్ అది. కథలోని కీలకమైన అంశాలకు సంబంధించిన హింట్ ఈ లోగోలోనూ, లుక్ లోనూ ఇచ్చేశాడు సుకుమార్. మరి సినిమా ఎలా ఉండబోతోందో?