ఏదన్నా సినిమా తెరకెక్కుతోందంటే.. ముందుగా ‘లీక్డ్ స్టోరీలు’ హల్‌చల్ చేసేస్తున్నాయి. ‘ఇదీ టైటిల్.. ఇదీ స్టోరీలైన్.. ఇదీ హీరో పాత్ర..’ అంటూ కుప్పలు తెప్పలుగా ఊహాగానాలు వచ్చేస్తుండడం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి కూడా ఈ లీకుల బెడద తప్పేలా లేదు. సినిమా టైటిల్ ముందుగానే లీక్ అయిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేసే ముఠాకి సంబంధించి లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడంటూ చాలా కాలం క్రితమే ఓ లీక్ బయటకు వచ్చింది. చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లోనూ అదే విషయం స్పష్టమయిపోయింది.
తాజాగా ఇదొక రివెంజ్ డ్రామా అనీ, అచ్చం రంగస్థలం షేడ్స్‌లో సాగుతుందనీ ఓ గాసిప్ బయటకు వచ్చింది. గాసిప్ మాత్రమే కాదు, ఏకంగా స్టోరీలైన్ ఇదేనంటూ ఓ పెద్ద కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏది నిజం.? అన్నది ఇప్పటికైతే సస్పెన్సే. ‘రంగస్థలం’ సినిమా టైవ్‌ులోనూ ఇలాంటి ఊహాగానాలు చాలానే విన్పించాయి. కానీ, ఆ ఊహాగానాలు తల్లకిందులయ్యాయి. మరి, ‘పుష్ప’ విషయంలో ఏం జరుగుతుంది.? అన్నది ఇప్పటికైతే సస్పెన్సే. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.