తెలుగు నాట సంచలన విజయం సాధించింది `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే వసూళ్లని మూటగట్టుకొంది. 2021లో టాలీవుడ్ సాధించిన అతి పెద్ద విజయాల్లో పుష్ప ఒకటి. ఈ సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్‌ల రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదే సినిమాని.. రష్మిక కూడా బాగా క్యాష్ చేసుకొంది. పుష్పతో.. బాలీవుడ్ ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రష్యాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
అవును.. ఇటీవల పుష్పని రష్యన్ భాషలో విడుదల చేశారు. ఓ భారతీయ సినిమాని అతి పెద్ద స్థాయిలో విడుదల చేసిన ఘనత పుష్పకే దక్కుతుంది. అందుకోసం బన్నీ, సుకుమార్ రష్యా వెళ్లి ప్రచారం కూడా చేసి వచ్చారు. ఈ సినిమా ప్రచారానికే దాదాపుగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. అయితే.. రష్యాలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కనీసం ప్రమోషన్ల ఖర్చుని కూడా రాబట్టుకోలేకపోయింది. తొలి రోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. రెండో రోజు పూర్తిగా పడిపోయాయి. మూడో రోజు నుంచే థియేటర్ల నుంచి.. పుష్పని తొలగించారు. మొత్తానికి రష్యాలో... పుష్పరాజ్ మానియా పని చేయలేదు. కాకపోతే.. రష్యాలోనూ తెలుగు సినిమాల్ని విడుదల చేసుకోవొచ్చు అనే హోప్‌ని మాత్రం పుష్ప అందించింది.