వంద థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షో.. ఎక్క‌డంటే..?

మరిన్ని వార్తలు

ఈయేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద సినిమా `పుష్ప‌`నే. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా సినిమా ఇది. డిసెంబ‌రు 17న విడుద‌ల అవుతోంది. తెలుగులో.. అల్లు అర్జున్ కిఉన్న మార్కెట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌చ్చితంగా... టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌డం ఖాయం.

 

అయితే... మిగిలిన చోట్ల‌కూడా ఇదే త‌ర‌హా ఓపెనింగ్స్‌రాబ‌ట్టాల‌ని చిత్ర‌బృందం కోరుకుంటోంది. త‌మిళం,క‌న్న‌డ,హిందీ చిత్రాల సీమ‌ల మాటేమో గానీ, మ‌ల‌యాళంలో బ‌న్నీకి మంచి క్రేజ్ ఉంది. అక్క‌డ బ‌న్నీని మ‌ల్లూస్టార్ అని పిలుస్తారు. మ‌ల‌యాళంలో స్టార్ హీరోకి ఉన్న క్రేజ్‌... బ‌న్నీకి ఉంటుంది. పుష్ప‌తో దాన్నిరెట్టింపు చేయాల‌న్నది బ‌న్నీ ఆలోచ‌న‌. అందుకే `పుష్ప‌` ఫ్యాన్స్ షో కోసం ఇప్ప‌టి నుంచే... క‌స‌ర‌త్తులు మొదలైపోయాయి. ప్ర‌స్తుతానికి 40 థియేట‌ర్ల‌లో `పుష్ప‌` స్పెష‌ల్ షోకి ప్లాన్ చేశారు.

 

ఈరోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లైపోయాయి. నెల రోజుల ముందే.. 40 థియేట‌ర్లు బుక్ చేశారంటే, డిసెంబ‌రు 17 నాటికి ఆ థియేట‌ర్ల సంఖ్య 100కి చేరే అవ‌కాశం ఉంది. 100 థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ షో వేస్తే.. ఆ హంగామా మామూలుగా ఉండ‌దు. బ‌న్నీ రేంజ్‌కి అది అద్దం ప‌డుతుంది. ఈ సినిమాతో మ‌ల‌యాళంలో బ‌న్నీ సూప‌ర్‌స్టార్ అయిపోవ‌డం ఖాయ‌మ‌ని అక్క‌డి చిత్ర వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మ‌రి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS