పవన్ కల్యాణ్ - రామ్ చరణ్ ల అనుబంధం గురించి చెప్పేదేముంది? బాబాయ్ అంటే చరణ్ కి ఎంత ఇష్టమో, చరణ్ అంటే పవన్‌కి ఎంత ప్రేమో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ముఖంగా ఇద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని బయట పెట్టుకున్నారు. ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయ్.. ఓ వినూత్న అవతారం ఎత్తబోతున్నట్టు టాక్.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. చరణ్‌ది చిన్న పాత్రే అని, కాకపోతే... తన ఎంట్రీ.. మెగా అభిమానులకు నచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. అయితే... ఈ సినమా షూటింగ్ అంతా పూర్తయ్యాక.. చివరి షెడ్యూల్ లో చరణ్‌పై సీన్స్ తెరకెక్కిస్తార్ట. అప్పటి వరకూ చరణ్ ఎంట్రీ గురించిన విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావిస్తోంది చిత్రబృందం. కాకపోతే.. ఆ మేటర్ ముందుగానే బయటకు లీకైపోయింది. ఇది నిజమా? లేదంటే.. గాసిప్ మాత్రమేనా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.