తెలుగు సినిమా వ్యాపారానికి కొత్త పాఠాలు నేర్పింది బాహుబలి. ఒకే కథని రెండు భాగాలుగా తీసి, బిజినెస్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఆ ఫార్ములా బాహుబలికి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు `పుష్ష` కూడా అదే బాట పట్టబోతోందని టాక్. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష`. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాని ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నార్ట.
నిజానికి పుష్షని రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన ముందు లేదు. అయితే ఫుటేజీ చూసుకుంటే... రెండు సినిమాలకు సరిపడా తయారవుతోందట. అందుకే ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడిందటచిత్రబృందం. రెండు భాగాల్ని రెండు నెలల వ్యవధిలో విడుదల చేసే అవకాశం ఉంది. షూటింగ్ అంతా పూర్తయ్యాకే... తొలి భాగాన్ని విడుదల చేస్తారు. నిజంగా ఇది వర్కవుట్ అయ్యే ఆలోచనే. బాహుబలిలా.. పుష్ఫ కూడా సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పార్ట్ 1, పార్ట్ 2ల జాతర మొదలైపోతుంది.