అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో హ్యాట్రిక్ కొట్టబోతోంది... `పుష్ష` సినిమాతో. ఆర్య, ఆర్య 2 తరవాత.. వీళ్ల కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. రంగస్థలం తరవాత... సుకుమార్, అల వైకుంఠపురములో తరవాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ నెల 8 నుంచి మారేడుమల్లిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు చిత్రబృందం అక్కడే మకాం వేయబోతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాలో విలన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. విజయ్ సేతుపతి నుంచి ఆర్య వరకూ పలు రకాల పేర్లు వార్తల్లో నిలిచాయి. బాబీ సింహాని కూడా అనుకున్నారు. తమిళంలోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. కాబట్టి.. తమిళ టచ్ ఉన్న నటుడినే విలన్ గా తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే.. చిత్రబృందం మాత్రం `మా సినిమాలో విలన్ ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు` అని ప్రకటించేసింది. ``ఇప్పటి వరకూ వార్తల్లో చాలామంది పేర్లు వినిపించాయి. అవేం నిజం కాదు. త్వరలోనే విలన్ ఎవరన్నది అధికారికంగా ప్రకటిస్తాం`` అని చిత్రబృందం తేల్చి చెప్పేసింది. తద్వారా ఈ రూమర్లకు కాస్త చెక్ పడినట్టైంది.