నలుగురు 'క్వీన్స్‌' వచ్చేశారోచ్‌.!

మరిన్ని వార్తలు

మిల్కీబ్యూటీ తమన్నా పక్కా లోకల్‌. మన రాజమండ్రి అమ్మాయే. ఇదంతా 'దటీజ్‌ మహాలక్ష్మి' వ్యవహారం. హిందీలో ఘన విజయం సాధించిన 'క్వీన్‌' రీమేక్‌ ఇది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు మొత్తం నాలుగు భాషల్లో 'క్వీన్‌' రీమేక్‌ అవుతోంది. తమన్నా, కాజల్‌, పారుల్‌ యాదవ్‌, మంజిమా మోహన్‌, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ క్వీన్స్‌గా నటిస్తున్నారు. ఒకేరోజు నాలుగు టీజర్స్‌ రిలీజ్‌ చేశారు. దేనికదే ప్రత్యేకం అనిపించేలా వీటిని డిజైన్‌ చేశారు. 

 

తెలుగు వెర్షన్‌ విషయానికి వస్తే తమన్నా అదరగొట్టేసింది. రాజమండ్రి బ్రిడ్జికీ, ఈఫిల్‌ టవర్‌కీ లింకు పెట్టగలమా.? రాజమండ్రి అమ్మాయి మహాలక్ష్మి ఈఫిల్‌ టవర్‌ని ఉడతతో పోల్చింది. తమిళ వెర్షన్‌లో కాజల్‌ కొంచెం ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లినట్లు అనిపిస్తోంది. అదేంటో టీజర్‌ చూస్తే తెలుస్తుంది. కన్నడ టీజర్‌ ఓకే అనిపించింది. మలయాళ టీజర్‌ సింప్లీ సూపర్బ్‌. 

 

యాక్టింగ్‌ స్కిల్స్‌లో మిగిలిన ముగ్గురు క్వీన్స్‌నీ మించిపోయింది మంజిమా. తెలుగు వెర్షన్‌కి 'అ' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, కన్నడ వెర్షన్స్‌కి రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ వెర్షన్‌కి నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ క్వీన్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS