'సైరా' నుండి 'లక్ష్మీ' ఆగమనం.!

మరిన్ని వార్తలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రధారి అయిన తమన్నా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ రోజు మిల్కీబ్యూటీ తమన్నా పుట్టినరోజు కావడంతో ఆమెకు పుట్టినరోజు కానుకగా 'సైరా' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేసింది. 

 

తమ్మూ బ్యూటీ లుక్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కట్టూ, బొట్టూ గెటప్‌ పరంగా తమన్నా ఓ రాణిలా రాజసంగా కనిపిస్తోంది. నుదుటున బొట్టు, శాస్త్రోక్తమైన చీర కట్టుతో మెడలో కంఠాభరణం, చెవులకు భారీ చెవి పోగులతో కనిపిస్తోంది. 'లక్ష్మీ' అంటూ ఈ సినిమాలో తమన్నా పాత్రను పరిచయం చేశారు. ఇంతవరకూ తమన్నా ఓ వేరియర్‌ పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరిగింది. ఈ ఫస్ట్‌లుక్‌ చూశాక తమన్నా పాత్ర ఎలా ఉండబోతోందనే ఆశక్తి నెలకొంది. 

 

చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాగా తమన్నా ఇటీవల 'నెక్ట్స్‌ ఏంటీ' అనే బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే 'దటీజ్‌ మహాలక్ష్మీ' సినిమాతో రానుంది. బాలీవుడ్‌ 'క్వీన్‌'కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. అన్నింటికీ మించి వరుణ్‌, వెంకటేష్‌ మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న 'ఎఫ్‌ 2'తో ఈ సంక్రాంతికి తమన్నా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS