'సవ్యసాచి'పై మ్యాడీ ఏమన్నాడంటే.!

By iQlikMovies - April 17, 2018 - 14:46 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని బుల్లోడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమాలో తమిళ నటుడు మాధవన్‌ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాధవన్‌ ఈ సినిమాలో తన షెడ్యూల్‌ పూర్తి చేసుకుని బయటికి వచ్చాడు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. 

'నేను ఇంతవరకూ చాలా సినిమాల్లో నటించాను. కానీ 'సవ్యసాచి' మాత్రం ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. సినిమాలో నా పాత్ర షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సెట్‌నీ, చిత్ర యూనిట్‌నీ వదిలి వెళ్లేందుకు చాలా బాధగా ఉంది. ఇంతవరకూ ఏ సినిమా విషయంలోనూ నేను ఇంతగా ఫీల్‌ అయ్యింది లేదు. రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నాను..' అని ట్వీట్‌ చేశాడు మాధవన్‌. తమిళ హీరో అయినా కానీ, మాధవన్‌కి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. మాధవన్‌ డబ్బింగ్‌ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలు అందుకున్న సందర్భాలున్నాయి. అమ్మాయిలకు డ్రీమ్‌ హీరో మాధవన్‌. 

ఎప్పటి నుండో స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ అది ఇప్పటికి కుదిరింది. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' మాధవన్‌కి తొలి తెలుగు సినిమా. మాధవన్‌ పాత్ర సినిమాకి అత్యంత కీలకమట. సీనియర్‌ నటి భూమిక మరో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో, కొత్త భామ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS