హీరో మాధవన్‌కి ఏమైంది?

మరిన్ని వార్తలు

ప్రముఖ తమిళ హీరో మాధవన్‌కి ఏం జరిగింది. ఆస్పత్రిలో ఉన్న ఫోటో షేర్‌ చేశాడు. నా భుజం ఇంకా నా ఆధీనంలోకి రాలేదంటూ పోస్ట్‌ పెట్టారు. అంటే షూటింగ్‌లో గాయపడ్ద కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఏ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అది? అసలు ఆయన ఎలా గాయపడ్డారు అనే విషయం తెలియాల్సి ఉంది. 

గతంలో బాలకృష్ణ కూడా ఇలాగే షూటింగ్‌లో గాయపడి, భుజానికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్నారు. అయితే మాధవన్‌ చేతికి తగిలిన గాయం ఏ పాటిదో కానీ, ఆయన కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మాధవన్‌ తమిళ హీరో అయినప్పటికీ, ఆయనకి తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. లవర్‌బోయ్‌గా ఆయనకి తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన డబ్బింగ్‌ సినిమాలకు మంచి ఆదరణ దక్కుంది తెలుగులో. అయినా కానీ మాధవన్‌ ఇంతవరకూ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయలేదు. 

తాజాగా ఆయన తెలుగులో 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మాధవన్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌ నటి భూమిక కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది 'సవ్యసాచి' సినిమాలో. 

కొత్త భామ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS