రత్తాలుపై అంత భారీ బడ్జెట్టా.?

By iQlikMovies - May 10, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో 'కాంచనమాల కేబుల్‌ టీవీ' సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మీ. తొలి సినిమాలోనే చూపించాల్సిన గ్లామర్‌ తళుకులు చూపించేసిందీ హాట్‌ బ్యూటీ. ఈ సినిమాలో శ్రీకాంత్‌ హీరోగా నటించాడు. శ్రీకాంత్‌ సంగతి పక్కన పెడితే, ఆ తర్వాత రాయ్‌ లక్ష్మీకి పెద్దగా ఆఫర్లు దక్కలేదు.

 

హీరోయిన్‌ అనే విషయమే చాలా కాలం మర్చిపోయారంతా ఈమెను. ఇక చాలా కాలం తర్వాత తమిళంలో 'కాంచన' సినిమాతో మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది రాయ్‌ లక్ష్మీ. లక్ష్మీ రాయ్‌గా తెరంగేట్రం చేసి, పేరులో చిన్న మార్పు చేసుకుని, రాయ్‌ లక్ష్మీ అంటూ పాపులర్‌ అవ్వాలనుకుంది. కానీ జరగలేదు. మెగాస్టార్‌ 150వ సినిమా 'ఖైదీ'లో 'రత్తాలూ..' అంటూ ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇక ఇక్కడితో రాయ్‌ లక్ష్మీ కెరీర్‌ టర్న్‌ అయ్యింది. లక్ష్మీ రాయ్‌ కాదు, రాయ్‌ లక్ష్మీ కాదు.. రత్తాలుగా సూపర్‌ పాపులారిటీ దక్కించుకుంది. ఆ పై బాలీవుడ్‌లో ఛాన్స్‌ దక్కించుకుంది. 'జూలీ 2' అంటూ బాలీవుడ్‌ తెరపై వెలిగిపోవాలనుకుంది. సినిమా విడుదలకు ముందే జూలీగా రాయ్‌ లక్ష్మీకి రావల్సిన పాపులారిటీ వచ్చేసింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినా, రాయ్‌ లక్ష్మీకి పోయిందేమీ లేదు. ఆ తర్వాత సౌత్‌లో ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో సినిమాలు కోకొల్లలుగా తెరకెక్కుతున్నాయి. ఎట్‌ ఏ టైం తెలుగు, తమిళ భాషల్లో దున్నేస్తోంది రాయ్‌ లక్ష్మీ. త్వరలోనే 'నియా 2' (తెలుగులో 'నాగకన్య')తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాక పోలీసాఫీసర్‌గా రెండు మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక తాజాగా రాయ్‌ లక్ష్మీ 'మిరుగా' అనే సినిమాలో నటిస్తోంది.

 

ఫారెస్ట్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండబోతున్నాయట ఈ సినిమాలో. పన్నీర్‌ సెల్వం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన తొలి సినిమా హీరో శ్రీకాంత్‌ నటిస్తుండడం విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS