నటి రాశి ఖన్నా తాజా చిత్రం తొలిప్రేమ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా రాశి ఖన్నా తన నిజజీవితంలో తనకి ఎదురైన తొలిప్రేమని మీడియాతో పంచుకుంది.
ఆ జ్ఞాపకాలు నేమరువేసుకుంటే- తనకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక అబ్బాయి తన వెంటపడి ప్రేమించమని ప్రాధేయపడ్డాడు అని అయితే అప్పట్లో అసలు తనకి ప్రేమ అంటే ఏంటి? ఏమి చెప్పాలో అర్ధం అవ్వక అలానే ఉండిపోయాను అని తన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ జ్ఞాపకాలు జీవితాంతం మోయాల్సిందే అన్న డైలాగ్ చాలా బాగా హిట్ అయింది. అందుకే రాశి ఖన్నా కూడా ఈ చిత్రంతో తన తొలిప్రేమ జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నాను అని తెలిపింది.
మరి ఈ చిత్రం చూశాక, అందరు తమ తోలిప్రేమలని గుర్తుచేసుకుంటే ఈ చిత్రం విజయవంతం అయినట్టే.