అభిమానుల నుంచి పూలు మాత్రమే కాదు, ఒక్కోసారి రాళ్ళు కూడా ఎదురవుతుంటాయి. అభిమానమంటేనే అంత. ఎంతగా అభిమానించేస్తారో, ఒక్కోసారి ఆ అభిమానం శృతిమించితే అంతలా వయొలెంట్ అయిపోతుంటారు. సెలబ్రిటీలకు అభిమానులతో వ్యవహారం అంత తేలిగ్గా మింగుడుపడే వ్యవహారం కాదు. ఇటీవలే ఆ విషయం అనసూయకి బాగా తెలిసొచ్చింది.
సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ పెరిగిపోవడం పట్ల సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది అనసూయ ఈ మధ్యనే. అయితే ఆ అభిమానం బెడిసికొట్టి, ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకోవడంతో అభిమానులు ఆమెపై విరుచుకుపడిపోయారు. అంతే అభిమానం పేకమేడలా కూలిపోయిందని భావించిందో ఏమో, సోషల్ మీడియా నుంచి అనసూయ తప్పుకుంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే రష్మికీ ఓ షాక్ తగిలింది.
అనసూయ ఎపిసోడ్ గురించి రష్మిని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఆమె అభిమానులు. 'ఆమెకు నేను గురువుని కాదు' అని కవరింగ్ అయితే ఇచ్చింది రష్మి. కానీ అది సరిపోలేదు. ఇంతలోనే 'జీఎస్‌టీ-2' (రామ్‌గోపాల్ వర్మ తీసిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' న్యూడ్ వీడియో)లో నటిస్తావా? అని ఓ అభిమాని అడిగాడు. దానికి ఆమె 'జీటీ-2'లో నటిస్తాననీ, ప్రవీణ్ సత్తారు దర్శకుడైతేనే చేస్తానని చెప్పింది. ఆమె క్లియర్‌గానే వుందిగానీ, ఆమె చెప్పిన మాట ఇంకోలా కన్వే అయ్యింది. 'జీఎస్‌టీ-2'లో రష్మి నటిస్తానని చెప్పిందంటూ ప్రచారం జరిగింది. అంతే రష్మి పేరుతో సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలయ్యింది.
కొందరు దురభిమానులైతే రష్మి ఫొటోల్ని మార్ఫింగ్ చేసేసి, వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా అంటే కత్తికి రెండు వైపులా పదును లాంటిదే. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతే సంగతులు. సైబర్ క్రైమ్ తరఫున ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఈ తరహా ఆగడాలు తగ్గకపోవడం శోచనీయం. రష్మి ఇప్పుడేం చేస్తుంది? అనసూయలా సోషల్ మీడియా నుంచి 'ఔట్' అయిపోతుందా? వేచి చూడాలిక.