రాశీఖన్నా ఈమధ్య తెలుగులో సినిమాలేం చేయలేదు. తన చేతిలోనూ పెద్దగా అవకాశాల్లేవు. అయితే ఐఎండీబీ ప్రకటించిన ఈవారపు టాప్ స్టార్ల లిస్టులో రాశీఖన్నా ఏకంగా 1వ స్థానం సంపాదించేసింది. ఈ రేసులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ స్టార్లని సైతం వెనక్కి నెట్టింది. విజయ్ సేతుపతి, కైరా అద్వాణీ, ఐశ్వర్యరాయ్‌లాంటి టాప్ సెలబ్రెటీలు సైతం.. రాశీఖన్నా కంటే వెనుక బడ్డారు. ఇటీవల ఫర్జ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది రాశీ. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. బాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రాశీఖన్నా ఈ వెబ్ సిరీస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. అందుకే ఇప్పుడు టాప్ 1 పొజీషన్‌లో నిలిచింది. పఠాన్ తో సూపర్ హిట్ కొట్టిన షారుఖ్ కి రెండో స్థానం దక్కింది. విజయ్ సేతుపతి మూడో స్థానంలో ఉన్నాడు. రెజీనాకు నాలుగు, ఆదిత్య చోప్రాకు ఐదు, దీపికాకు ఆరు స్థానాలు దక్కాయి.
ఫర్జ్ వెబ్ సిరీస్‌తో రాశీఖన్నాకు కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టైంది. ఈ వెబ్ సిరీస్ తనకు మరిన్ని అవకాశాల్ని, కొత్త క్రేజ్‌నీ సంపాదించి పెడుతుందని రాశీ భావిస్తోంది. బాలీవుడ్ లో ఈ వెబ్ సిరీస్ గురించీ, అందులో రాశీ నటన గురించి మాట్లాడుకొంటున్నప్పటికీ.. తెలుగులో తనకు ఎలాంటి అవకాశాలూ రావడం లేదు. కొత్త కథానాయికల హవా మధ్య రాశీ కనిపించకుండా పోయింది. ఇప్పటికైనా రాశీని పిలుస్తారేమో చూడాలి.