తమిళంలో రాశి ఖన్నా హాట్‌ షో

By iQlikMovies - March 24, 2018 - 10:39 AM IST

మరిన్ని వార్తలు

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాదు, బికినీలో గ్లామర్‌ పండించాల్సి వచ్చినా వెనక్కి తగ్గడంలేదు రాశి ఖన్నా. నిన్న మొన్నటిదాకా కొంచెం స్లోగా సాగిన రాశీ కెరీర్‌ ఇప్పుడు జోరందుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ కోసం పరుగులు పెడ్తోంది. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగుతోపాటు, తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. 

తాజాగా తమిళంలో విశాల్‌ సరసన ఓ సినిమాలో రాశి ఖన్నాకి ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది తెలుగులో వచ్చిన 'టెంపర్‌' సినిమాకి రీమేక్‌ అట. విశాల్‌ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. ముందుగా 'టెంపర్‌' రీమేక్‌ని శింబు చేయాలనుకున్నా, అది విశాల్‌ చేతుల్లోకి వచ్చింది. 'టెంపర్‌' బాలీవుడ్‌లోనూ రీమేక్‌ అవుతోన్న సంగతి తెల్సిందే. తెలుగులో ఆల్రెడీ ఎన్టీఆర్‌కి మంచి సక్సెస్‌ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇక ఈ తమిళ టెంపర్‌ సినిమా కోసం ముద్దుగుమ్మ రాశి ఖన్నా బికినీలో కన్పించబోతోందట. 

బొద్దుగుమ్మలకు తమిళంలో భలే క్రేజ్‌ ఉంటుందిలే. సో రాశి ఖన్నా లాంటి బొద్దుగుమ్మలు కోలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువే. అన్నట్లు రాశీఖన్నా తెలుగులోనూ ఆల్రెడీ ఓ సినిమాలో బికినీ షో చేసేసింది. రవితేజ హీరోగా నటించిన 'బెంగాల్‌ టైగర్‌' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీపడి మరి బికినీ షో చేసింది రాశీఖన్నా. 

ఇప్పుడు తమిళ తంబీల కోసం మరోసారి అమ్మడు హాట్‌ బికినీ షో చేయనుందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS