గ్లామర్‌పాత్రల్లో నటించడానికి ఏమాత్రం మొహమాటపడని కథానాయిక రాశీఖన్నా. చిట్టి పొట్టి డ్రస్సుల్లో మెరిసిపోవడం తనకు అలవాటే. హాట్ హాట్ ముద్దు సీన్లలోనూ ఈజీగానే రాణించేస్తుంటుంది. అయితే ఈమధ్య రాశీఖన్నా ఓ విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక మీదట హాట్ సీన్లలో నటించనని, బెడ్ రూమ్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది.
విజయ్ దేవరకొండతో నటించిన `వరల్డ్ ఫేమస్‌లవర్`లో కొన్ని బెడ్ రూమ్ సీన్లు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే రాశీఖన్నా ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పుకున్నారు. ఓ సినిమా విడుదలైన తరవాత, ఆ సినిమాని నెగిటీవ్ గా కామెంట్ చేయడం ఏమిటని నెటిజన్లు కూడా విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అందుకనేనేమో. ఇప్పుడు రాశీఖన్నా మాట మార్చింది. `నేను అలా అనలేదు` అంటూ క్లారిఫై ఇచ్చింది. ఓ సినిమాలో నటించిన తరవాత, దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ కామెంట్ చేయనని, ప్రతీ పనినీ ప్రేమించే చేస్తానని, తాను నటించిన సినిమాల్ని ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి.. రాశీఖన్నా అనకుండా ఆ స్టేట్‌మెంట్లు ఎలా బయటకు వచ్చాయో..?