కథానాయికలు తమ కెరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు నడవడం ఎంత సాధారణమో, ఒక్కసారైనా ఐటెమ్ గీతంలో నర్తించడం అంతే సహజం. టాప్ హీరోయిన్లంతా ఎప్పుడో ఒకప్పుడు ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తిన వాళ్లే. ఇప్పుడు రాశీ ఖన్నా కూడా ఈ జాబితాలో చేరబోతున్నట్టు సమాచారం.
రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. కథానాయికలుగా నిధి అగర్వాల్, నభా నటేషా పేర్లు దాదాపుగా ఖాయమయ్యాయి. ఈ చిత్రంలో మరో కథానాయికకీ ఛాన్స్ ఉందట. అయితే ఈ కథానాయికని ఐటెమ్ గీతం కోసం తీసుకుంటార్ట. ఆ అవకాశం రాశీఖన్నాకు వచ్చినట్టు సమాచారం. రాశీ ఐటెమ్ గీతాలలో ఇంత వరకూ కనిపించింది లేదు. తనతో ఐటెమ్ పాటంటే... కొత్త క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నార్ట. ఈ పాటలో నర్తించడానికి రాశీ కూడా ఓకే చెప్పేసినట్టు టాక్. ప్రస్తుతం `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమా పూర్తయిన తరవాతే... రమేష్ వర్మ చిత్రం పట్టాలెక్కుతుంది.