మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో 'సుప్రీం' సినిమాలో నటించింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ సినిమాలో శ్రీదేవి పాత్రలో కామెడీ కూడా పండించేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కోసం తన టాలెంట్‌ని మరో సారి ప్రదర్శించబోతోంది. ఈ ముద్దుగుమ్మ మంచి సింగర్ అన్న సంగతి తెలిసిందే. తొలి సినిమా 'జోరు'లో ఆ టాలెంట్ ఆడియన్స్‌కి చూపించేసింది కూడా. 'జోరు' టైటిల్ సాంగ్ పాడేసి, కుర్రోళ్ల గుండెల్ని అప్పుడే తన గళంతో కొల్లగొట్టేసింది. అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పాటలు పాడింది లేదు.
హీరోయిన్‌గానే చెలామణీ అవుతోంది కానీ. కానీ ఇప్పుడు మళ్లీ సింగర్ అవతారమెత్తిందట. ఆది కూడా తనకెంతో ఇష్టమైన ఫ్రెండ్ తేజు కోసం అంటోంది. తేజు అందరికీ స్నేహితుడే. అందరితోనూ చలాకీగా, కలిసిపోతూ ఉంటాడు మనోడు. ఆ స్నేహంతోనే 'జవాన్' సినిమాలో ఓ పాట పాడింది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయాన్నే ఆమె స్వయంగా చెప్పింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కీ, సినిమా డైరెక్టర్ బి.వి.ఎస్ రవికీ థాంక్స్ చెప్పింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'బంగారు..' అనే ఈ సాంగ్‌లోంచి చిన్న బిట్‌ని ప్రస్తుతం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
రేపు ఈ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఇంత క్యూట్‌గా తన కోసం పాట పాడినందుకు ప్రియమైన శ్రీదేవికి థాంక్స్ చెప్పాడు నవ్వుల రారాజు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ నెల 19న 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.