'వెంకీ మామ'తో రాశీఖన్నా 'క్యూట్‌' హగ్‌ సో స్వీట్‌యా.!

By iQlikMovies - August 24, 2019 - 18:25 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ రాశీఖన్నా ప్రస్తుతం బిజీగానే ఉంది. ఇటు తెలుగు, అటు తమిళ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. 'వెంకీ మామ'లో రాశీఖన్నా నాగచైతన్యకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఆన్‌ లొకేషన్‌ లేటెస్ట్‌ పిక్స్‌ కొన్ని నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో రాశీఖన్నా, విక్టరీ వెంకటేష్‌ని క్యూట్‌గా హగ్‌ చేసుకుంది. లంగా వోణీ ధరించి ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది.

 

ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్‌ సమాచారం ప్రకారం రాశీఖన్నా ఈ సినిమాలో ట్రెడిషనల్‌ లుక్స్‌లోనే కనిపిస్తుందట. ఓ స్కూల్‌ టీచర్‌ పాత్రలో రాఖీఖన్నా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. పాయల్‌ ఎప్పటిలాగే హాట్‌ లుక్స్‌తో అలరించనుందట.

 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్‌ విషయమై కూడా తాజాగా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అనుకున్న టైం కన్నా ముందే 'వెంకీ మామ' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. బహుశా అక్టోబర్‌లోనే ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారట. ఈ సినిమాలో వెంకటేష్‌, నాగచైతన్య రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ని పోషిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS