డిస్కో రాజా యంగ్‌ స్టన్నింగ్‌ లుక్‌ నభా కోసమేనా?

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ తాజా చిత్రం 'డిస్కోరాజా'కి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్నది అక్షరాలా మాస్‌రాజా రవితేజ అంటున్నారు. గుర్తుపట్టడం కష్టమే. అంతలా యంగ్‌ అండ్‌ స్టన్నింగ్‌ లుక్‌లో రవితేజ కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. పేరు తెలుసుకున్నాక, ఈ ఫోటోని దగ్గరగా అబ్జర్వ్‌ చేస్తేనే ఇది మాస్‌ రాజా ఫోటో అని తేల్చుకోగలం. నిజంగా ఇది మాస్‌ రాజా మేకోవరా? లేక గ్రాఫిక్‌ మాయాజాలమా? అని తేల్చుకోలేనంత స్టన్నింగ్‌గా ఉందీ లుక్‌.

 

ఇకపోతే, రవితేజ నటిస్తున్న ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి ఈయన చిత్రాలు. విలక్షణ చిత్రాల్ని తెరకెక్కించడంలో మనోడు ధిట్ట. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాలతో హిట్‌ కొట్టిన ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పుడు మాస్‌రాజాతో కూడా ఓ విలక్షణ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఈ సినిమా ఉండబోతోందట. రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో రవితేజ కనిపించబోతున్నాడట. ఆ రెండు గెటప్స్‌లో భాగంగానే రవితేజ ఈ యంగ్‌ లుక్‌లో కనిపించబోతున్నాడనీ సమాచారమ్‌.

 

ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారే పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌. వీరిలో నభా నటేష్‌ యంగ్‌ రవితేజకి జోడీగా నటిస్తుందట. ఇదే రవితేజ ఆ యంగ్‌ లుక్‌ అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లుక్‌లో రవితేజ నిజంగానే పాతికేళ్ల కుర్రోడిలా హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS