మల్టీ స్టారర్స్ అంటే ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య అందాల పోటీ తప్పదు. అందాలే కాదు, పర్‌ఫామెన్స్‌లోనూ పోలిక తప్పదు. అలా ఈ వారం పోటీకి దిగుతోన్న ఇద్దరు ముద్దుగుమ్మలు పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా. 'వెంకీ మామ' సినిమాతో ఈ ఇద్దరు భామలు నువ్వా.? నేనా.? అన్నట్లుగా బరిలోకి దిగుతున్నారు. రీసెంట్‌గా జరిగిన 'వెంకీ మామ' ఆడియో ఫంక్షన్ వేడుకలో ఇద్దరూ తమదైన శైలిలో గ్లామర్ తళుకులతో మురిపించారు. కానీ, స్టేజ్‌పై 'ఆర్ ఎక్స్' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, తన కన్నా సీనియర్ అయిన రాశీఖన్నాని బాగా డామినేట్ చేసేసింది.
స్క్రీన్ ప్రెజెన్స్‌లోనూ, ఆడియన్స్‌ని తనదైన తేనెలొలికే తీపి మాటలతో ఆకట్టుకోవడంలోనూ రాశీఖన్నాని మించి మార్కులు కొట్టేసింది. సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ పాత్ర అదే తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. చేసినవి రెండు సినిమాలే వాటిలో తొలి సినిమాకే ప్రభంజనం సృష్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక రెండో సినిమా చెప్పుకోదగ్గ పేరు తీసుకురాకపోయినా, పాయల్ ప్రభావం యూత్‌లో చాలా చాలా ఎక్కువే ఉందనడం అతిశయోక్తి కాదేమో.
ఒకవేళ 'వెంకీ మామ' హిట్ అయ్యిందంటే పాయల్ కెరీర్‌లో మరింత దూసుకెళ్లడం ఖాయం. ఇప్పటికే ఆమె చేతిలో పలు ప్రెస్జీజియస్ ప్రాజెక్టులున్నాయి. రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలో పాయల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే, తాజా చిత్రం 'వెంకీ మామ' ఈ శుక్రవారమే ప్రేక్షకుల్ని అలరించనుంది.