'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ముద్దుగా బొద్దుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదగలేకపోతోంది. అయినా కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడంలో ఏముంది. మంచి నటిని అనిపించుకోవడంలోనే అసలైన తృప్తి ఉందంటోంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'సుప్రీమ్' సినిమాలో పోలీసాఫీసర్‌గా కామెడీ యాంగిల్‌ని ప్రదర్శించింది. అలాగే కమర్షియల్గానూ మెప్పించింది. అమ్మడికి అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం లేకపోయినప్పటికీ, ట్రెడిషనల్‌గా కనిపించడమే ఇష్టమంటోంది. తెలుగులో ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'జై లవ కుశ' సినిమాలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నాది కీలకమైన హీరోయిన్ పాత్ర అంటున్నారు. మరో పక్క అమ్మడు మలయాళ పరిశ్రమలోకి అడుగు పెట్టనుంది. మలయాళంలో ముమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తోందట. చబ్బీ చబ్బీగా, బబ్లీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ షేడ్ ఏంటి అనుకుంటున్నారా? అవునండీ నిజమేనట. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాలో రాశీఖన్నా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనుంది. తన యాక్టింగ్లోని డిఫరెంట్ యాంగిల్‌ని చూపించే పాత్ర ఇది అంటోంది. విశాల్, హన్సిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.