నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, జగపతిబాబు, సత్యరాజ్ తదితరులు
దర్శకత్వం : కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్, థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
రేటింగ్: 2.5/5
'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా కాదు ప్రపంచస్థాయి స్టార్ అయ్యాడు ప్రభాస్. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచం నలుమూలల నుంచి ప్రేక్షకులు వస్తారు. దానికి తగ్గటే తన సినిమాలని ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. భారీదనంకు పెద్దపీట వేస్తూ సినిమాలని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన 'సాహో' నిరాశ పరిచినప్పటికీ భారీదనంలో ఎక్కడా తగ్గలేదు. కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ లు, ,మైండ్ బ్లోయింగ్ లోకేషన్లుతో రిచ్ గా కనిపించింది. ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అదే భారీదనం.
సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే రిచ్ అండ్ భారీదనం కనిపించింది. సినిమాని ఇటలీలో షూటింగ్ చేశారు. భారీ సెట్లు వేశారు. ఇక కథ పరంగా వస్తే .. దర్శకుడు రాధకృష్ణ దాదాపు పదేళ్ళు ఈ కథని రాసుకున్నాని, తెలుగు తెర ఎన్నడూ చూడని ప్రేమకథ రాధేశ్యామ్ అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. బాహుబలి , సాహో లాంటి హెవీ యాక్షన్ తర్వాత ప్రభాస్ ఓ ప్రేమకథని చేయడం మరో రిఫ్రెష్మెంట్ అనిపించింది. పైగా ప్రేమ కథకు హస్త సాముద్రికం నేపధ్యం జోడించారు. ట్రైలర్, టీజర్ .. సినిమాని వెంటనే చుసేయాలనే ఆసక్తిని పెంచాయి. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధేశ్యామ్' ఆ అంచనాలు నెలబెట్టుకొగలిగిందా ? ఇంతకీ ఏమిటీ రాధేశ్యామ్ ల ప్రేమకథ ?
కథ :
విక్రమాదిత్య (ప్రభాస్) హస్తసాముద్రికంలో లెజెండ్. చేతి రాతలని చూసి వందేళ్ళ జీవితాన్ని చెప్పేస్తుంటాడు. ప్రధానమంత్రి చేయి చూసి దేశంలో ఎమర్జన్సీని ముందే చెప్పేస్తాడు. ఇలా అందరి రాతలని చేసే విక్రమాదిత్య చేతిలో మాత్రం ప్రేమ గీత వుండదు. తన జాతకంలో ప్రేమ గీతలేదని ఎవ్వరిని ప్రేమించడు. అమ్మాయిలతో సరదా కొన్నాళ్ళు గడిపి వదిలేయడమే విక్రమాదిత్య లవ్ స్టైల్.
దీనికి ఫ్లర్టీషన్షిప్ అనే పేరుపెట్టుకుంటాడు. అలాంటి ఆదిత్య, ప్రేరణ (పూజాహెగ్డే) ని చూస్తాడు. తొలి చూపులోనే ఇష్టపడతాడు. అందరి అమ్మాయిలానే ప్రేరణతో కూడా ఫ్లర్టీషన్షిప్ చేయాలని అనుకుంటాడు. కానీ అది ప్రేమగా మారుతుంది. తన జీవితంలో ప్రేమ గీతలేదని బలంగా నమ్మే విక్రమాదిత్య తన నమ్మకాని ఎదురెళ్ళి ప్రేరణను ప్రేమిస్తాడా ? వీరిద్దరి జీవితంలో విధి, ప్రకృతి ఎలాంటి పాత్ర పోషించిదనేది మిగతా కథ
విశ్లేషణ :
ప్రతి కథకి మూలం ఒక ఆలోచన. ఒక ఐడియా కథగా మారుతుంది. సినిమా కథ విషయానికి వస్తే ఐడియా ఒక సీన్ రూపంలో రావచ్చు. కథ అనుకున్నప్పుడే బలమైన ఓ రెండు సీన్లు మనసులో తడతాయి. వాటిని ఆసక్తికరమైన మరో ఇరవై సీన్స్ అల్లగలిగితే అనుకున్న ఐడియా సినిమాగా పాస్ అయిపోతుంది. 'రాధే శ్యామ్ 'కథ ఐడియా కూడా బావుంది. ఐడియా అనుకున్నప్పుడే రెండు సీన్లు తట్టివుంటాయి. దురదృష్టం ఏమిటంటే .. ఆ రెండు సీన్లు పట్టుకునే సినిమా తీయడానికి దిగిపోయారు.
ఒక ప్రేమ కథకు భారీదనం లేకపోయినా పర్వాలేదు కానీ భారీ ఎమోషన్ మాత్రం మిస్ అవ్వకూడదు.
రాధే శ్యామ్ లో అదే ప్రధాన లోపం. పాత్రల మధ్య ఏ మాత్రం ఎమోషనల్ కనెక్షన్ వుండదు. తెరపై ఒక కథ చూస్తున్నపుడు మూడు సీన్ల తర్వాతైనా.. తారలు మాయమైపోయి పాత్రలు మాత్రమే కనిపించాలి. కానీ రాధేశ్యామ్ లో ప్రతి చోట ప్రభాసే కనిపిస్తాడు. అందంగా ముస్తాబైన పూజా హేగ్దేనే వినిపిస్తుంటుంది. సినిమా మొత్తంలో ఒక్క చోట కూడా ఆడ్రెనాలిన్ రష్ ఇవ్వని సినిమా ఈ మధ్య కాలంలో రాధేశ్యామ్ అనుకోవాలి. రీళ్ళకు రీళ్ళు అయిపోతుంటాయి తప్పా.. ఒక్క చోట కూడా అదిరిపోయిందనుకునే ఫీలింగ్ రాదు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ అలా నిత్సేజంగా కూర్చోవడం ప్రేక్షకుడి వంతౌతుంది.
రాధే శ్యామ్ పాయింట్ చాలా చిన్నది. దీని చుట్టూ భారీదనం అల్లి ఆ పాయింట్ లో ఏదో బ్రహ్మాండం వుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ భారీదనం ఈ పాయింట్ ని కాపాడలేకపోయింది. ఒక ప్రేమ కథలో ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ బావుండాలి. వాళ్ళు పాత్రలు మాత్రమే కనిపించాలి. కానీ ఇక్కడ విక్రమాదిత్యకి బదులు ప్రభాస్, ప్రేరణకి బదులు పూజ హెగ్డేలు కనిపిస్తుంటారు.
విధిని సైతం ఎదురించి ఒక్కటిగా బ్రతకాలకునే ప్రేమికల కథ ఇది. అలాంటప్పుడు ఆ ప్రేమ ఎలా వుండాలి ? ఆ కెమిస్ట్రీ ఎలా వుండాలి ? ఆ మ్యాజిక్ ఏ స్థాయిలో వుండాలి ? కానీ రాధే శ్యామ్ లో ప్రేమికుల మధ్య ఆ మ్యాజిక్కే జరగలేదు. సునామికి ఎదురుగా నిలబడి ప్రేయసి కోసం వస్తున్న ప్రేమికుడిపై జాలి కలగడం పక్కన పెడితే .. ఈ ఎపిసోడ్ అయిపొతే ఇంక శుభం కార్డే గా ని ఫీలౌతుంటాడు ప్రేక్షకుడు. అంత అసహజంగా ఎమోషన్ లెస్ గా తయారైయింది రాధేశ్యామ్.
పేమ కథలో ఎక్కడా ఆత్మ కనిపించదు, ఇద్దరు కలిస్తే బావున్ను అనిపించదు. అమ్మాయిలతో సరదాగా గడిపి వదిలేసే విక్రమ్ ఆదిత్య ప్రేమణతో ప్రేమలో ఎందుకు పడతాడో ఒక్క సీన్ లో కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేయలేదు. హీరోయిన్ కాబట్టి గతి లేక ప్రేమించాలనే తంతు కనిపిస్తుంది తప్పితే ఎమోషన్ వుండదు. పైగా కథలో చాలా లోపాలు వున్నాయి.
చాలా చోట్ల రైటింగ్ లో అపరిపకత్వ కనిపిస్తుంది, జైరాం పాత్రని వాడుకున్న విధానం చూస్తే .. ఇదేం రైటింగ్ దిని కోసం ఆ పాత్రని సృస్టించాలా ? అనిపిస్తుంది. అయితే ముందు చెప్పుకున్నట్లు ఈ సినిమాలో ఓ రెండు సీన్లు బావున్నాయి, ఇంటర్వెల్ కు ముందు వచ్చే బ్లాక్ కథపై ఆసక్తిని పెంచింది. అయితే ఇంటర్వెల్ తర్వాత ఆ ఆసక్తి మొత్తం మళ్ళీ నీరుగారిపోతుంది. ఇక చివర్లో షిప్ ఎపిసోడ్ గురించి గొప్పగా ప్రచారం చేశారు కానీ అది ఈ కథలో బాగం కాకపోవడం ప్రధాన మైనస్.
నటీనటులు :
విక్రమ్ ఆదిత్య పాత్రలో ప్రభాస్ హుందాగా కనిపించాడు. చాలా హ్యాండ్సమ్ గా వున్నాడు. ఇందులో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. పూజ హెగ్డే అందంగా కనిపించింది. ఆమె నటన కూడా ఓకే. అయితే డబ్బింగ్ మాత్రం అరువు తెచ్చుకున్న మాటల్లా కొన్ని చోట్ల అనిపించింది. పరమహంస పాత్ర చేసిన కృష్ణం రాజు ని చాలా రోజులు తర్వాత చూడటం కొత్తగా కనిపిస్తుంది. సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ, జయరాం పాత్రలు పరిధి మేర చేశారు, మిగతా నటులకు అంత ప్రాముఖ్యత లేదు.
టెక్నికల్ గా :
అద్భుతమైన నిర్మాణ విలువలు వున్న సినిమా ఇది. ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా అనిపిస్తుంది . పాటలు చాలా లావిష్ గా చిత్రీకరించారు . తమన నేపధ్య సంగీతం బావుంది. మనోజ్ పరమ హంస కెమరా పనితనం అద్భుతం. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కి ఫుల్ మార్కులు పడతాయి.గుర్తు పెట్టుకునే డైలాగులు లేవు. రైటింగ్ టేబుల్ దగ్గర ఇంకా బలంగా పని చేయాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ , పూజా హెగ్డే
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన కథ
బోరింగ్ స్క్రీన్ ప్లేయ్
ఆకట్టుకొని ఎమోషన్స్
ఫైనల్ వర్దిక్ట్ : జాతకం బాలేదు