టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. సంక్రాంతి బరి నుంచి మరో పెద్ద సినిమా తప్పుకుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడిపోయింది. అదే బాటలో రాధే శ్యామ్ కూడా వెళ్లిపోయింది. రాధేశ్యామ్ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అదే పక్కా అయిపోయింది. జవనరి 14న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు విడుదల కావడం లేదు. మార్చి18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే అది కూడా ఖాయం కాదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. దేశమంతా థర్డ్ వేవ్ భయాలు కమ్మేస్తున్నాయి. ఈ దశలో పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. బాలీవుడ్ లో విడుదల కావాల్సిన జెర్సీ రావడం లేదు. తమిళ నాట అజిత్ సినిమా కూడా వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమాలకు ఇది గడ్డు కాలం అని చెప్పాలి. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో... ఈ సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయో..??
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే చిత్రబృందం 200 నుంచి 300 కోట్ల వరకూ ఖర్చు పెట్టిందని ఓ అంచనా. ఇప్పటికే ఈ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు. ఈ వాయిదాల పరంపర వల్ల నిర్మాతలే కాదు, ఈ సినిమా కొన్న బయ్యర్లు కూడా భారీగా నష్టపోతున్నారు.